- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Srinivas Goud : దేవుడి దగ్గర ప్రాంతీయ భేదాలు మంచి పద్ధతి కాదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల(Telangana public representatives letters of recommendation) ను అనుమతించకపోవడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర ప్రాంతీయ భేదాలు మంచి పద్ధతి కాదని, తెలంగాణ ఆలయాల్లో అందర్నీ సమానంగా చూస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తిరుమలలోనూ అందర్నీ సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
గద్వాల నియోజకవర్గంలోని జములమ్మ అమ్మవారిని ఆదివారం నాడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం గద్వాల బీఆర్‌ఎస్ నాయకుడు బాసు హనుమంత నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటారని గుర్తు చేశారు. అలాంటప్పుడు దేవుడి వద్ధ ప్రాంతీయ వివక్షతలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో లేని విధంగా కొంత కాలంగా తిరుమలలో తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఆపడం ద్వారా భేదాభిప్రాయాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు. తక్షణమే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీని కోరారు.
దేవుడి దగ్గర అంతా సమానమేనని.. దీంట్లో రాజకీయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రా ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి అని తెలిపారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకోవాలని అనుకుంటారని పేర్కొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు గద్వాలలో నేసిన పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.