Good News:గురుకుల విద్యార్థులకు శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన

by Jakkula Mamatha |
Good News:గురుకుల విద్యార్థులకు శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సీ, బీసీ వసతి గృహాలను మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.

ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గురుకులాల కోసం 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు మహర్దశ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులకు ప్రతి జిల్లాకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాం. రూ.206 కోట్లతో 62 కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న 10 మందికి పైగా విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed