అంతర్గత అంశాలపై ఇతర దేశాల జోక్యం తగదు: విదేశాంగ ప్రతినిధి అరిందం బాగ్చీ

by Disha Desk |
అంతర్గత అంశాలపై ఇతర దేశాల జోక్యం తగదు: విదేశాంగ ప్రతినిధి అరిందం బాగ్చీ
X

న్యూఢిల్లీ: దేశ అంతర్గత సమస్యలపై ఇతర దేశాల జోక్యాన్ని స్వాగతించమని విదేశాంగ ప్రతినిధి అరిందం బాగ్చీ అన్నారు. హిజాబ్ వివాదం న్యాయ పరిశీలనలో ఉన్న సమయంలో ప్రేరేపిత వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 'కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థల్లో డ్రెస్‌కోడ్‌కు సంబంధించిన అంశం హైకోర్టు న్యాయ పరిశీలనలో ఉంది. దేశ రాజ్యాంగ నిబంధనావళి, యంత్రాంగం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. భారత్ గురించి బాగా తెలిసిన వారు ఈ వాస్తవాలను సరిగ్గా అర్థం చేసుకుంటారు. మా అంతర్గత సమస్యలపై ప్రేరణాత్మక వ్యాఖ్యలు స్వాగతించబడవు' అని పేర్కొన్నారు. అంతకుముందు హిజాబ్ వివాదంపై అమెరికా రాయబారి స్పందిస్తూ పాఠశాలల్లో హిజాబ్ నిషేధాలు మత స్వేచ్ఛను ఉల్లంఘించాయని తెలిపింది. ఇది మహిళలు, బాలికలను అట్టడుగున ఉంచాయని పేర్కొంది. కాగా హిజాబ్‌ను ధరించారనే కారణంతో ఉడిపిలో కొందరు విద్యార్థినులను కాలేజిలోకి అనుమతించకపోవడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed