- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
దిశ, ఇందల్వాయి: రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా బంధు కేసీఆర్ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు. దీంతో ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళా బంధు సంబురాలను స్థానిక ఎంపీపీ రమేష్ నాయక్ అధ్యక్షతన లో మూడు రోజులుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు థాంక్ యూ కేసీఆర్ అని వరుసగా కూర్చొని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారనీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్ స్థానిక రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయి లో మిషన్ భగీరథ ద్వారా 70 గ్రామాలకు నీరు అందిస్తున్నామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వున్న ఏ పార్టీలు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ ప్రజలంటే చులకనగా చూశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాల స్ఫూర్తితో తెలంగాణ సాధించిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కిందన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. గురుకుల విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు కృషి, మహిళ కోసం ప్రత్యేకంగా 4 పారిశ్రామికుల ఏర్పాటు, వంటి అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆడపడుచులు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేష్ నాయక్, జడ్పీటీసీ జగన్, వైస్ ఎంపీపీ అంజయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు దాసు, ఎంపీడీఓ రాములు నాయక్, తహశీల్దార్ రమేష్, ఏపీఎం సువర్ణ, మహిళా సమాఖ్య సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.