- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీకి సెగ తాకే వరకు మా పోరు ఆగదు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల పక్షాన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా ఈ నల్లజెండాను ఎగురవేశామన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నల్లజెండాలను ఎగురవేసి రైతులకు సంఘీభావం తెలపాలని కోరారు. తెలంగాణ రైతన్నలు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్షను వీడనాడాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనేదాకా రైతుల తరపున కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఊరూరా ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని, గ్రామ కూడళ్లలో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసి ఢిల్లీ వరకు ఈ నిరసన సెగలు తాకేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.