హ్యాపీ హోలీ..! : ప్రజలకు మంత్రి హరీష్ రావు పండుగ శుభాకాంక్షలు

by samatah |   ( Updated:2022-03-17 11:35:21.0  )
హ్యాపీ హోలీ..! : ప్రజలకు మంత్రి హరీష్ రావు పండుగ శుభాకాంక్షలు
X

దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని తెలిపారు. చిన్నపిల్లలకు హోలీ రంగులు కళ్ళల్లో పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి అన్నారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన రంగులు, నీటితోనే హోలీ పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story