యాదాద్రిలో ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు.. బడ్జెట్‌పై కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
యాదాద్రిలో ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు.. బడ్జెట్‌పై కీలక వ్యాఖ్యలు
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు మంత్రికి అందజేసారు. అనతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి, సొంత భూమి ఉన్న పేదల గృహ నిర్మాణాలకు రూ. 3 లక్షలు అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లు తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనలతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారన్నారు. ఇది పూర్తిగా పేదలకు, వెనకబడిన వర్గాలకు లబ్ది చేకూర్చే బడ్జెట్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కటేంకర్ పవన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story