- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Megastar: బ్లాక్ సూట్‌లో నాగార్జున-చిరు వారసులు.. ఆకట్టుకుంటోన్న మెగాస్టార్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: సోమవారం (అక్టోబరు 28) అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ అవార్డు(ANR Award) వేడక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఏఎన్నార్ నేషనల్ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అందుకున్నారు. అయితే ఇప్పటికే చిరు అమితాబ్ అండ్ నాగార్జున(Nagarjuna)కు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా చిరు నెట్టింట మరో ట్వీట్ పెట్టి.. మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా చేశారు. ఈ పోస్ట్ లో నాగార్జున, మెగాస్టార్ వారసులు అంతా బ్లాక్ సూల్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. నాగార్జున, చిరంజీవి, నాగచైతన్య(Naga Chaitanya), రామ్ చరణ్ (Ram Charan), అఖిల్ (Akhil) ఉన్న నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఫొటోలకు.. ‘అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం అని క్యాప్షన్ రాసుకొచ్చారు. అలాగే అక్కినేని నాగార్జునకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన స్నేహానికి, నిన్నటి అన్ని అద్భుతమైన క్షణాలకు’’ అని చెబుతూ రెండు ఫోటోలను చిరు పంచుకున్నారు. ఇక నాగార్జున-చిరంజీవి బాండింగ్ గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం బ్లాక్ సూట్ లో ఉన్నఈ సెలబ్రిటీల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అక్కినేని, మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.