‘నేను కడుపులో ఉన్నప్పుడు ఆయన సినిమాకు వెళ్తుంటే జట్కా బండి అదుపు తప్పింది’: చిరంజీవి

by Anjali |
‘నేను కడుపులో ఉన్నప్పుడు ఆయన సినిమాకు వెళ్తుంటే జట్కా బండి అదుపు తప్పింది’: చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఎన్నార్ నేషనల్ అవార్డు(ANR National Award) వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేతుల మీదుగా అవార్డు అందుకున్నాక చిరు ఎన్నో విషయాలను ఈ ఈవెంట్ లో పంచుకున్నారు. తను సినీ కెరీర్ లో ఎదుగుతోన్న క్రమంలో బయట చాలా మంది పొగిడేవారని అన్నారు. ఇంటికెళ్లాక మా నాన్న కూడా నన్ను మెచ్చుకుంటాడు కావచ్చు అని నేను భావించేవాడినని అన్నారు. కానీ ఆయన నన్ను ప్రశంసించకపోయేదని, మరీ ఎందుకు నన్ను పొగడకపోయేదని అనుకునేవాడినని తెలిపారు. ఈ కారణంగా నాకు కొంచెం బాధగా అనిపించేదని అన్నారు. మళ్లీ ఒక రోజు నా కవర్ పేజీల(cover pages)తో పలు పుస్తకాలు చూస్తున్నారు.. నేను ఆయన దగ్గరికి వెళ్లేసరికి అవి పక్కప పెట్టేశారని తెలిపారు.

ఇక మా అమ్మ దగ్గరకు వెళ్లి.. నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారమ్మా? ఫొటోలు బాగోలేకపోయినా కూడా బాగున్నాయంటారు అనుకున్నానని.. కానీ ఏం అనలేదని అమ్మతో చెబుతూ బాధపడ్డానని వెల్లడించారు. దీంతో మా అమ్మ.. నువ్వు అలా బాధపడకు నాన్న.. ఆయన నిన్ను బాగా నటిస్తావని, నా కుమారుడు అదుర్స్ అంటూ పొగుడుతారని చెప్పింది. మరీ నా ముందు ఒక్క మాట చెప్పొచ్చు కదా అంటే.. పిల్లల్ని ఎప్పుడూ కూడా పొగడకూడదని, అలా వారితో చెబితే ఆయుక్షీణం(longevity) అని అమ్మ చెప్పిందంటూ మెగాస్టార్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. అలాగే నేను అమ్మ కడుపులో ఉన్నప్పడు నాగేశ్వరరావు మూవీకి వెళ్లామని తెలిపారు.

ఇందుకోసం నాన్న ఒక జట్కా బండి ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ క్రమంలో జట్కా బండి దారి తప్పిందని, దీంతో నాన్న సినిమా చూడటం వద్దు ఇంటికి వెళ్దామన్నారని, కానీ అమ్మ అస్సలు వినకుండా మూవీ చూడాల్సిందేనని పట్టుబట్టారట అని చెప్పారు. అమ్మకు ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed