హ్యాపీ సింగిల్ డే అంటూ మెగా హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వచ్చే శ్రావణ మాసం కల్లా పెళ్లి భోజనాలు పెడతారంటూ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-11-11 08:30:44.0  )
హ్యాపీ సింగిల్ డే అంటూ మెగా హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వచ్చే శ్రావణ మాసం కల్లా పెళ్లి భోజనాలు పెడతారంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో ఈయన నటనకు గాను ఉత్తమ నూతన పరిచయ నటుడిగా సైమా అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’, ‘జవాన్’, ‘ఇంటిలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్ యు’, ‘ప్రతి రోజూ పండగే’, ‘చిత్రలహరి’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘SDT18’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇలా ఓ పక్కా సినిమాలు చేస్తూ కూడా నిత్యం సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా సాయి ధరమ్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డిఫరెంట్ లుక్‌తో దర్శనిమిచ్చాడు. అలాగే రెండు చేతులతో నమస్కారం చేస్తున్నట్లు స్టిల్ ఇచ్చిన ఫొటోను షేర్ చేసి.. ‘ప్రకాశవంతంగా వెలుగుతున్న ప్రతి ఒక్కరినీ విస్మరించాలి.. హ్యాపీ సింగిల్స్ డే 11/11/24’ అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ‘ఇప్పుడు ఇలానే అంటారులే అన్నా తీరా చూస్తే వచ్చే శ్రావణ మాసంలో పెళ్లి భోజనాలు పెడతారు. మీరు మమ్మల్ని మోసం చేయలేరు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story