ట్రాఫిక్‌‌లో లేడీ సింగం.. డ్యాన్సింగ్ మూవ్స్‌తో అవేర్‌నెస్

by Javid Pasha |
ట్రాఫిక్‌‌లో లేడీ సింగం.. డ్యాన్సింగ్ మూవ్స్‌తో అవేర్‌నెస్
X

దిశ, ఫీచర్స్ : జీవితంతో పాటు ట్రాఫిక్‌ను కూడా కంట్రోల్ చేస్తున్న 26 ఏళ్ల ఇండోర్ యువతి శుభి జైన్ 'లేడీ సింగం'గా పేరు తెచ్చుకుంది. చౌరస్తాలో నిలబడి వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవేర్‌నెస్ కల్పిస్తూనే.. తన చేష్టలతో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ 'డ్యాన్సింగ్ ట్రాఫిక్ గర్ల్'గా పాపులరైంది. ఈ మేరకు ఆమె కృషిని గుర్తించిన ఇండోర్ ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ వాలంటీరింగ్ ప్రోగ్రామ్ 'యతాయత్ ప్రభందన్ మిత్ర'కు తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం విశేషం.

గుడ్‌మార్నింగ్ అంటూ 'ఇండోర్ వాసులను' నిద్రలేపే ఆర్‌జే శుభి.. మధ్యాహ్నానికి ఆంత్రప్రెన్యూర్‌గా, సాయంత్రానికి ట్రాఫిక్ వార్డెన్‌గా సేవలందిస్తోంది. ఈ పోటీ ప్రపంచంలో రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ మహిళలు ఏ పనైనా సమర్థంగా చేయగలరని నిరూపిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకం గా నిలుస్తోంది. 2019లో ఇండోర్ పోలీసులు తమ ఇనీషియేటివ్‌లో భాగంగా ట్రాఫిక్ నిర్వహణ కోసం కళాశాల విద్యార్థులను స్వచ్ఛందంగా ఆహ్వానించారు. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన శుభి.. పోలీస్ ఉద్యోగం సంపాదించకపోయినా, పోలీస్ ఆఫీసర్ లైఫ్‌ను అనుభవించే చాన్స్ వచ్చినందుకు పొంగిపోయింది. ప్రస్తుతం చేస్తున్న పనితో హ్యాపీగా ఉంది.

'ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రమాదాల రేటు కచ్చితంగా తగ్గుతుంది. సాధారణంగా ఆఫీస్ పని ముగించుకుని ఇంటికెళ్లే హడావిడిలో ఉండే వ్యక్తులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ పట్టించుకోవడం లేదని గమనించాను. ఈ క్రమంలోనే రూల్స్ పాటించని వారిని విమర్శించే బదులు అనుసరించే వారిని అభినందించడం ప్రారంభించాను. వారికి చేతులు జోడించి నమస్కరించడంతో మిగతావాళ్లు కూడా రూల్స్ ఫాలో అయ్యేందుకు ప్రయత్నించారు. ఇక ప్రజల్లో అవగాహన పెంచేందుకు డ్యాన్స్ మూవ్స్‌ ఎంచుకున్నాను' అని శుభి జైన్ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed