- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దంపతుల మధ్య తరుచుగా అలా జరుగుతుందని.. వివాహిత మృతి
దిశ, నిర్మల్ కల్చరల్: తెల్లవారితే పండగ అనగా.. వారింట్లో విషాదం చోటు చేసుకుంది. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ లో అర్గుల ప్రణీత (24) అనే వివాహిత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కుంటాల మండలానికి చెందిన ప్రణీత మంజులాపూర్ కు చెందిన తన మేనబావ అర్గుల సాయికృష్ణ తో ఎనిమిది సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. వీరికి ఆరు సంవత్సరాలలోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి సంసారంలో తరచుగా మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో గత నాలుగునెలల క్రితం ఇరుపక్షాల పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పి అత్తారింటికి పంపారు. అయితే మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్త, అత్త కుటుంబసభ్యుల వేధింపులతోనే మృతి చెందిందని ఆరోపిస్తూ తగిన న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ప్రణీత సోదరుడు ప్రవీణ్ స్థానిక నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినయ్ కుమార్ వివరించారు.