- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తంలో దాని పాత్రే కీలకం.. ప్రొఫెసర్ రవి కామరాజు
దిశ ప్రతినిధి, వరంగల్: భారతదేశం సైన్స్, టెక్నాలజీలో క్రీయాశీలకంగా దూసుకుపోవాలని, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశం సైన్స్ రంగంలో జరుగాల్సినంతా అభివృద్ధి జరుగలేదని ఆంధ్రా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ రవి కామరాజు చెప్పారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి తక్కళ్ళపల్లి పురుషోతమరావు నివాసంలో ఆదివారం తెలంగాణ జనవేదిక ఆన్లైన్ సదస్సు జరిగింది. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము నేతృత్వంలో ప్రపంచ వ్యవస్థ సమూల భాగం యొక్క రేఖా స్వరూపము- నూతన ప్రపంచ వ్యవస్థ ఆవిర్భావం ' అనే అంశంపై సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ పొలిటికల్, ఇంటర్నేషనల్ స్టడీస్ విభాగం ప్రొఫెసర్ రవి కామరాజు హజరై కీలక ప్రసంగం చేసారని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ పాత్ర కీలకమని.. అణుయుద్ధాలు ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశాలన్ని అణు యుద్ధ సంపత్తిని పెంచుకుని మనిషిని జీవనాన్ని ఆగమాగం చేస్తున్నాయని వివరించారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాలు ఆణుయుద్దాల భాగస్వాములు అయ్యే అవకాశం ఉందన్నారు. అణు బాంబులున్న దేశాలదే ప్రపంచం అన్న చందంగా మారుతున్నాయని అన్నారు. ప్రపంచం ఇంటర్నేషనల్ లా అతిక్రమించపడుతోందని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ ప్రపంచాన్ని కుదిపేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధాలతో వాతావరణం దెబ్బతింటుందని.. దీంతో ఆహారపు కొరతతో పాటు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. వ్యవస్థకు అనుగుణంగా - వ్యవస్థలోని మనుషులు మారాలని, ఆప్గ్రేడ్ కావాలని లేకపోతే వెనుకబడి పోతామని ఉదాహరించారు. ఈ సదస్సుకు సంయోజకులుగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు వ్యవరించగా, ఎ.రఘుకుమార్, ఉమామహేశ్వర్రెడ్డి, బైర్డు శ్యాం, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్, ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్, పెండ్లి అశోర్బాబు, మనోజిరెడ్డి, సీహెచ్ నరేంద్ర, డాక్టర్ కవిత బైశెట్టి, జి.శ్రీకాంత్, జేమ్స్ ప్రశాంత్, రవీందర్రావు, అశోక్ కుమార్, ఎ.మధు, ముక్తేశ్వర్రావు, సురేశ్ తోట, డాక్టర్ ఎ భుజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.