రేగు చెట్టుకు ఉరి వేసుకుని భర్త మృతి.. కారణం అదే

by S Gopi |
రేగు చెట్టుకు ఉరి వేసుకుని భర్త మృతి.. కారణం అదే
X

దిశ, చింతలమానేపల్లి: చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతిచెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన తుమ్మిడే బండయ్య(28) అతనికి భార్య- మూడు సంవత్సరముల కుమార్తె ఉంది. బతుకుదెరువు కోసం అత్తవారి ఇళ్లు అయినటువంటి దిందా గ్రామంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్యాస్ ఎసిడిటీ, హై బీపీ ఉన్నందువల్ల పలు హాస్పిటళ్లకు వెళ్లాడు. అయినా తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం దిందా గ్రామంలో రేగు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి తుమ్మిడే సుశీల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి. విజయ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed