రాజమౌళి-మహేష్ కాంబో అప్‌డేట్.. హీరోయిన్ ఫిక్స్..??

by Javid Pasha |   ( Updated:2022-03-09 03:54:24.0  )
రాజమౌళి-మహేష్ కాంబో అప్‌డేట్.. హీరోయిన్ ఫిక్స్..??
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమౌళి-మహేష్ కాంబో కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. వారు కోరుకున్న ఈ కాంబో ఎట్టకేలకు మూవీ చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ఈ సినిమా మహేష్ హీరోయిన్ ఎవరన్నది ఇండస్ట్రీ హాట్ టాపిక్. అయితే తాజాగా రాజమౌళి ఈ మూవీ కోసం మళ్లీ తన సీతనే ఓకే చేశాడంటూ నెట్టింట వార్తలు తెగ వినిపిస్తున్నాయి. మహేష్‌తో తాను చేయనున్న సినిమాలో కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాను ఓకే చేయాలని జక్కన్న చూస్తున్నాడట. ఇందుకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. అమ్మడితో పాటు మరో స్టార్ హీరోయిన్ పేరు కూడా చర్చల్లో ఉందని చర్చలు జరుగుతున్నాయి. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. మరి త్వరలో మేకర్స్ ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Advertisement

Next Story