Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో అనూహ్య పరిణామం

by GSrikanth |   ( Updated:2022-08-05 08:44:04.0  )
Mahabubnagar Court Issues Notice to Minister Srinivas Goud Over His Murder Conspiracy Case
X

దిశ, వెబ్‌డెస్క్: Mahabubnagar Court Issues Notice to Minister Srinivas Goud Over His Murder Conspiracy Case| తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రితో పాటు సైబరాబాద్ సీపీ, డీసీపీ బాలానగర్‌తో కలిపి మొత్తం 18 మందికి మహబూబ్ నగర్ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 10న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని ఫిబ్రవరిలో రాజు, విశ్వనాథ్‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారు బెయిల్‌పై బయటకు వచ్చాక మహబూబ్ నగర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వారు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరికొందరికి కోర్డు నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఇకపై రేవంత్ రెడ్డి ముఖం చూడను.. వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story