మార్చి 11న ఎల్ఐసీ ఐపీఓ..?

by Web Desk |
మార్చి 11న ఎల్ఐసీ ఐపీఓ..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఓ మార్చి 11న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ప్రారంభించబడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించినట్టు రాయిటర్స్ తెలిపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇతర ఇన్వెస్టర్ల బిల్డింగ్ కోసం ప్రక్రియ మొదలు పెట్టనున్నారు.

ఈ ఐపీఓ నుంచి ప్రభుత్వం 8 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 60 వేల కోట్ల) నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) మార్చి మొదటి వారంలోగా రెగ్యులేటరీ ఆమోదం పొందుతుందని, ఆ తర్వాత మార్కెట్ ప్రైస్ బ్యాండ్ నిర్ధారిస్తారని వారు పేర్కొన్నారు. అయితే ఈ వివరాలపై ఎల్ఐసి, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించలేదు.

ఐపీఓ తేదీ మారే అవకాశాలు ఉన్నాయని, తదుపరి ప్రక్రియను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని సంబంధిత వ్యక్తులు తెలిపారు. అలాగే, ఎల్ఐసీ ఒక్కో షేర్ ధర రూ. 2,000-2,100 వరకు ఉండొచ్చని ఇటీవల బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. కాగా, ఇప్పటికే ఎల్ఐసీ 5 శాతం వాటాను విక్రయించేందుకు సెబీ వద్ద డ్రాఫ్ట్ ఫైల్ చేసింది.

Advertisement

Next Story