పైప్ లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న భగీరథ నీరు

by S Gopi |
పైప్ లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న భగీరథ నీరు
X

దిశ, బొంరాస్ పేట్: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవడంతో నీరు బయటకు చిమ్ముతుంది. దీంతో ఆ ప్రాంతంలో మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని లగచర్ల గ్రామంలోని ఈదమ్మ గుడి వెనుక భాగంలో మంగళవారం మధ్యాహ్నం భగీరథ పైప్ లైన్ కు లీకేజీ ఏర్పడడంతో, నీరు పైకి ఎగజిమ్మింది. దీంతో నీరు వృథాగా నేలపాలవుతుంది. మిషన్ భగీరథ (పర్యవేక్షకులు) నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో నీటిని నిలిపివేశారు.

Advertisement

Next Story