- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెళ్లి పీటలెక్కబోతున్న కీరవాణి తనయుడు.. వధువు ఎవరంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి(M.M. Keeravani) కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. సీనియర్ నటుడు మురళీమోహన్(Murali Mohan) మనవరాలు రాగ మాగంటితో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తాజాగా, వీరిద్దరి ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్(Golkonda Resorts)లో ఆదివారం రాత్రి నిర్వహించారు. అయితే ఈ వేడుక గ్రాండ్‌గా జరగ్గా.. ఇందులో పలువురు సినీ ప్రముఖులు హాజరై పెళ్లి కాబోతున్న జంటను ఆశీర్వదించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. కీరవాణి ఇంటికి కాబోతున్న కోడలు రాగ గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆమె మురళీ మోహన్ కొడుకు రామ్ మోహన్(Ram Mohan) కూతురు. అయితే రాగ విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసినట్లు సమాచారం. ప్రజెంట్ రాగ(raaga) కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కీరవాణి పెద్ద కొడుకు పెళ్లి కాకుండానే శ్రీసింహా(Sri Simha) వెడ్డింగ్ జరగనుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఇది ప్రేమ పెళ్లి కావొచ్చని చర్చించుకుంటున్నారు.