- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss-8: నిఖిల్ బండారం బయపెట్టిన మాజీ లవర్.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: బిగ్‌బాస్-8(Bigg Boss-8) కంటెస్టెంట్ నిఖిల్(Nikhil) అందరికీ సుపరిచితమే. ఆయన ‘గోరింటాకు’ సీరియల్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు షోస్, సీరియల్స్ చేసిన ఆయన ప్రజెంట్ రియాలిటీ షోలో పాల్గొంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే నిఖిల్,నటి కావ్య(Kavya Shree)తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు పెళ్లి(marriage) కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ ఊహించని విధంగా ఈ జంట మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తడంతో బ్రేకప్(breakup) చెప్పుకుని విడిపోయారు.
ఇక ఇటీవల బిగ్‌బాస్(Bigg Boss-8) షోలో నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ షో అయిపోగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వే నా భార్యవి అని చెప్పాడు. ఇక ఈ స్టోరీ విన్న వారంతా కావ్య(Kavya Shree) గురించి అని ఆమెకు పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, కావ్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సెన్సేషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘మాస్కులు వేసుకుని నటించేవాళ్లను చూసి మోసపోవద్దు. పరిస్థితులకు తగినట్లుగా ఫేక్ మనుషులు మారుతుంటారు. కానీ ఏదోక సందర్భాల్లో వాళ్ల అసలు రంగును బయపెడతారు. వాళ్ల ముసుకు తొలగేవరకు వేచి చూడండి.
ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్లకు బాగా తెలుసు. పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు. వాళ్ల యాక్టింగ్ చూసి.. నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అలాంటి వారి గురించి జనాలకు ఉన్న అభిప్రాయాలను మార్చలేం. వాళ్లే బాధితులు అన్నట్లుగా నటిస్తారు. నమ్మిస్తారు. నిజమైన బాధితులను దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వాళ్లు మహా దిట్ట’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా నిఖిల్‌ను ఉద్దేశించే పెట్టిందని అంటున్నారు.