Delhi: ఢిల్లీలో లగచర్ల ఫార్మా బాధితులు.. మరికొద్దిసేపట్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

by Shiva |
Delhi: ఢిల్లీలో లగచర్ల ఫార్మా బాధితులు.. మరికొద్దిసేపట్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల (Lagacharla) ఫార్మా పరిశ్రమ బాధిత కుటుంబాలు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి చేరుకున్నాయి. ఇవాళ నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), జాతీయ మహిళా కమిషన్‌ (NCW)ను కలిసి తమపై రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ (Telangana) పోలీసులు చేసిన దాడులు, అరెస్టులపై బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయనున్నాయి. వారికి మద్దతుగా ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ (Satyavathi Rathore) హస్తినకు చేరుకున్నారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR), ఆ పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు.

కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) తన నియోజకవర్గం కొడంగల్‌ (Kodangal)లో ఫార్మా పరిశ్రమల (Pharma Industries) ఏర్పాటుకు భూసేకరణకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ (Prathik Jain), అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై దాడి చేసిన లగచర్ల (Lagacharla)తో పాటు పరిసర గ్రామాల్లోని గ్రామస్థులను అరెస్ట్ చేసింది. తమపై జరిగిన దాడిని ఇది వరకే తెలంగాణ (Telangana) ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు సోమవారం నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed