ట్రాక్టర్ డబ్బా ఢీ కొని యువకుడికి తీవ్రగాయాలు..

by Sumithra |
ట్రాక్టర్ డబ్బా ఢీ కొని యువకుడికి తీవ్రగాయాలు..
X

దిశ, పర్వతగిరి : రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన పర్వతగిరి మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొంకపాక నుండి తీగరాజుపల్లి వెళ్లే రోడ్డులో రోడ్డు పై నిలిపి ఉన్న ట్రాక్టర్ డబ్బాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రోహిత్ కుమార్ మండలంలోని కల్లెడలో గ్రామంలో టైల్స్ వేసే పనులు చేస్తున్నాడు. పనులు ముగించుకొని ద్విచక్రవాహనం పై వరంగల్ కు వెళ్తుండగా శ్రీనగర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్ను ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన రోహిత్ కుమార్ ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో వరంగల్ యంజీయం హాస్పిటల్ కు తరలించారు.

గత మూడు రోజులుగా ఇసుక ట్రాక్టర్ డబ్బా రోడ్డు మీదనే ఉందని, చీకటి సమయంలో ట్రాక్టర్ డబ్బా కనిపించడం లేదని, ట్రాక్టర్ వైపు ఎలాంటి హెచ్చరిక స్టిక్కర్లు లేవని ఇంజన్లో లోపాలు వస్తే డబ్బాను రోడ్డుపైనే వదిలి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని వాహనదారులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమాని పై తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed