- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పుష్ప నటుడు.. పెళ్లి ఎప్పుడంటే?
దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో డాలి ధనుంజయ(Daali Dhananjay) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన తెలుగులో ‘పుష్ప’(Pushpa) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ధనుంజయ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. త్వరలో ఆయన పెళ్లి(marriage) పీటలెక్కబోతున్నాడు. డాక్టర్ ధన్యత(Dr. Dhanyatha)తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇటీవల ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబోయే భార్యతో తీసుకున్న పిక్స్ షేర్ చేశాడు. దీంతో అంతా ఆనందపడ్డారు.
ఈ క్రమంలో.. తాజాగా, ధనుంజయ(Dhananjay) ఆదివారం నవంబర్ 17న ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకున్నాడు. ఇరు కుటుంబ పెద్దలు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు కాబోయే దంపతులు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలో పెళ్లి ముహూర్తం(wedding ceremony) కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ధనుంజయ(Dhananjay) పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న మైసూర్‌లో ధనుంజయ, ధన్యతల వివాహ మహోత్సవం జరనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అవి చూసిన వారు శుభాకాంక్షకులు చెబుతున్నారు.