- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ginger Garlic Paste: అల్లం వెల్లుల్లి పేస్ట్ లో అల్లమే లేదంట.. రెడీ టు కుక్ ఫుడ్స్ తో యమా డేంజర్
దిశ, వెబ్ డెస్క్: ఇన్ స్టంట్ ఫుడ్.. గరంమసాలా నుంచి బిరియాని వరకూ.. ఏది కావాలన్నా ఇన్ స్టంట్ గా మార్కెట్లో దొరికేస్తుంది. మసాలా పొడులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger Garlic Paste), పులిహోర మిక్స్ (Pulihora Mix), బిరియాని మిక్స్, ఉప్మా మిక్స్, దోసె పిండి, ఇడ్లీ పిండి, పరోటా, చపాతీలు.. ఇలా రెడీ టు కుక్ ఐటమ్స్ మార్కెట్లోకి చాలానే వచ్చాయి. మరి ఇవి ప్రజల బద్దకానికి అనుగుణంగా వచ్చాయో, కాలనుగుణంగా వచ్చాయో తెలీదు గానీ.. వాటి ప్రభావం మాత్రం ఆరోగ్యాలపై తీవ్రంగా ఉంటుందనేది నిజం. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే పచ్చినిజం.
మన బద్దకం లెవల్స్ ఏ లెవల్లో ఉన్నాయంటే.. కాసింత తాలింపు వేసి, వండిన అన్నంలో కలిపి, అందులో రెండు నిమ్మకాయల రసం కలిపితే అయిపోయే పులిహోర కూడా చేయలేనంత. దానికి కూడా పులిహోర మిక్స్ ప్యాకెట్లను కొనుక్కుంటున్నారు చూడండి.. ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉండదేమో. అసలు ఈ రెడీ టు కుక్ ఆహారపదార్థాలు ఎలా తయారవుతాయో తెలిస్తే వాటి జోలిక్కూడా వెళ్లరు.
అంతెందుకు నిన్న హైదరాబాద్ లో 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పట్టుకున్నారు. కుళ్లిన అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఉన్న తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించింది. 1500 కిలోల పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. తీరా చూస్తే ఈ తనిఖీల్లో తేలిందేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో అల్లమే లేదు. దానికి బదులుగా సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వాడి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరుతో అమ్మకాలు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కలున్న ప్రముఖ హోటళ్లకు వీళ్లే సప్లై చేస్తున్నారు.
మూడేళ్లుగా ఈ కల్తీ దందా జరుగుతోంది. ఆన్లైన్లోనూ ధైర్యంగా అమ్మారంటే చూడండి.. తాము దొరకం అని ఎంత నమ్మకమో. ఇటీవల వీరి కల్తీ వ్యాపారంపై టాస్క్ ఫోర్స్ కు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు నిర్వహించారు. సిట్రిక్ యాసిడ్ 55 కిలోలు, 480 కిలోల నాసిరకం వెల్లుల్లిని సీజ్ చేశారు. సమీర్ అన్సారీ (33), గుల్ఫార్జ్ (32), ముక్తార్ (27), రంజిత్ కుమార్ (19), మోను కుమార్(20), బిర్వాల్ సాహ్(19), ఇనాయత్(32), మహేశ్‌కుమార్ (20)లను అదుపులోకి తీసుకున్నారు.
ఒక్క అల్లం వెల్లుల్లి పేస్టే కాదు.. ఇప్పుడు మీరు మార్కెట్లో ఎంతో ఇష్టంగా కొనుక్కుని తెచ్చుకుంటున్న రెడీ టు కుక్ ఫుడ్స్ ఏవీ హై క్వాలిటీతో తయారు చేసినవి కాదు. పెద్ద కంపెనీ లేబుల్ తో ప్యాక్ చేసి ఉంటే.. అది ఆరోగ్యకరమైన ఆహారం అయిపోదని గుర్తుంచుకోండి. ఉద్యోగానికి వెళ్లాలనో, బద్దకంగా ఉందనో ఇలాంటివి వాడితే.. తర్వాత ఆస్పత్రుల బిల్లులు కట్టుకోడానికి కూడా ఏమీ మిగలదు.