- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అస్తవ్యస్తంగా బస్ స్టాండ్ నిర్వహణ..
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వాహాలను పార్కింగ్ ప్లేస్ మారింది. దీంతో బస్ స్టాండ్ లో ప్రజలు కుర్చోవాలంటే లేదా బస్ స్టాండ్ నుండి రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాండ్ లోని మొదటి గేటు నుండో లేదా రెండవ గేటు నుండో ప్రైవేట్ వాహనాలు బస్ స్టాండ్ లోకి వస్తాయో తిలియని దుస్థితి నెలకొంది. అదే విధంగా లక్షల రూపాయలను ప్రభుత్వం వెచ్చించి బస్ స్టాండ్ నిర్మాణం జరుపగా అందులో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో మూతపడింది. గతంలో ఆర్టీసీ అధికారులు దుకాణాల నిర్వహణ కోసం టెండర్ పిలువగా ఓ వ్యక్తి టెండర్ ద్వారా దుకాణాలను తీసుకుని కొద్ది రోజుల పాటు నడిపించాడు. దుకాణాల కరెంట్ బిల్లు వాడుకున్నదానికంటే ఎక్కువగా బిల్లు రావడంతో దుకాణం నిర్వహణ పై చేతులెత్తి వేశాడు.
దీంతో సుమారుగా గత ఆరు నెలలుగా దుకాణాలు మూతపడ్డాయి. అప్పట్లోనే ఇక్కడి బస్ స్టాండ్ లో పార్కింగ్ స్థలం ఏర్పాటు కోసం షెడ్ల నిర్మాణం చేస్తామని, అనంతరం టెండర్ పిలుస్తామని అధికారులు పరిశీలించారు. అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ టెండర్ ద్వారా బస్ స్టాండ్ నిర్వహణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మరుగుదొడ్లకు సాయంత్రం అయిందంటే వాటికి తాళాలు వేస్తున్నారని, దీంతో గత్యంతరం లేక బస్ స్టాండ్ వెనుక గల ఖాళీ ప్రదేశంలో ప్రయాణికులు మల మూత్ర విసర్జన చేస్తున్నారు. రాత్రిపూట బస్ స్టాండ్ లో లైట్ లు సరిగ్గా వెలగక పోవడంతో నైట్ హాల్ట్ బస్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు చీకటి పూట అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా బస్ స్టాండ్ లో కంట్రోలర్ లేకపోవడంతో ఏ బస్ ఏ సమయానికి వస్తుందో తెలుసుకోవడం కష్టంగా మారిందని, వెంటనే సిరిసిల్ల డిపో మేనేజర్ స్పందించి ఎల్లారెడ్డి పేట బస్ స్టాండ్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.