- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV: రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: వివాదాలకు కేంద్ర బిందువు, స్టార్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ఏపీ హైకోర్టు (AP High Court)లో బిగ్ షాక్ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆర్జీవీ (RGV) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash Petition)ను ధర్మాసనం కొట్టివేసింది. ‘వ్యూహం’ (Vyuham) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు (Chandrababu), నారా లోకేశ్ (Nara Lokesh)లను కించపరిచేలా సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో పోస్టులు పెట్టాడని మద్దిపాడు (Maddipadu) టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం (Muthanapally Ramalingam) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 14న కేసు విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని రామ్‌గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని కోర్టు సూచించింది.