మెడికల్ షాప్ లో అగ్నిప్రమాదం..

by Sumithra |
మెడికల్ షాప్ లో అగ్నిప్రమాదం..
X

దిశ, ఉప్పల్ : ఉప్పల్ న్యూ శాంతి నగర్ లోని దీపిక మెడికల్ షాప్ లో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఒకేసారి మంటలు రావడంతో స్థానికులు అది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్నిప్రమాదంలో పూర్తిగా మెడిసిన్స్ దగ్ధం అయ్యాయి. సుమారు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed