- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
New Orleans: మరోసారి కాల్పులతో వణికిన అమెరికా.. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
దిశ. నేషనల్ బ్యూరో: అమెరికా మరోసారి కాల్పులతో వణికిపోయింది. న్యూ ఓర్లీన్స్ (New Orleans) నగరంలో తాజాగా రెండు వేర్వేరు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. న్యూ ఓర్లీన్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (Police department) తెలిపిన వివరాల ప్రకారం.. సెయింట్ రోచ్ పరిసరాల్లోని అవెన్యూలో మొదటగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన మరో 45 నిమిషాల తర్వాత అదే ప్రాంతానికి ఒక కిలోమీటరు సమీపంలో మరోసారి నిందితులు కాల్పులకు తెగపడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఒకరు మరణించారు. ఓ కార్యక్రమం నిమిత్తం కవాతు జరుగుతున్న సందర్భంగా దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెల 10న అలబామాలోని టుస్కేగీ యూనివర్సిటీలో భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు.