AP Govt.: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్పు ఇక సులభతరం!

by Shiva |
AP Govt.: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్పు ఇక సులభతరం!
X

దిశ, వెబ్‌డెస్క్: గుడిలో దైవ దర్శనాలకు మొదలు రేషన్ షాపుల (Ration Shops) వరకు ఆధార్ కార్డు (Aadhar) ప్రాముఖ్యత ఏమిటో అందరికీ తెలుసు. నేడు ఏ పని జరగాలన్నా.. ఆధార్ తప్పసరి. అయితే, ఆధార్ నమోదు సమయంలో డేట్ ఆఫ్ బర్త్ (Date Of Birth) తప్పుగా పడితే.. సరిచేసుకునేందుకు జనం పడే పాట్లు వర్ణాణాతీతం. ఒకవేళ పుట్టిన తేదీని మార్చాలంటే వ్యక్తి స్టడీ, బర్త్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ, నిరక్షరాస్యులకు అవన్నీ ఉండవు. దీంతో అలాంటి వారు ఆధార్‌ డేట్ ఆఫ్ బర్త్‌లో మార్పులు చేసుకునేందు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Government Hospital) వైద్యులు ఇచ్చే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ప్రాథమిక సమాచారం. డేట్ ఆఫ్ బర్త్ మార్పు కోసం పంచాయితీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు అందించే సర్టిఫికెట్ల మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను కూడా అనుమతించాలని ఏపీ ప్రభుత్వం (AP Government) సన్నాహాలు చేస్తుంది. అదేవిధంగా ఆ సర్టిఫికేట్లపై క్యూ‌ఆర్ కోడ్ (QR Code) ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ పరిణామంలో ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే వారి పని మరింత సులభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed