Kannappa: కేదార్‌నాథ్‌ను సందర్శించిన కన్నప్ప టీమ్.. వీడియో వైరల్

by sudharani |   ( Updated:2024-11-03 14:27:00.0  )
Kannappa: కేదార్‌నాథ్‌ను సందర్శించిన కన్నప్ప టీమ్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa). అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించగా.. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ (Update) ఎంతో ఆకట్టకున్నాయి. అలాగే.. సినిమాలో వర్క్ చేస్తున్న ప్రతి క్యారెక్టర్‌కు సంబంధించి నటీనటుల లుక్స్ రిలీజ్ (release) చేస్తూ సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ తదితరుల పాత్రలకు సంబంధించి లుక్స్‌తో రివీల్ (reveal) చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ‘కన్నప్ప’ టీమ్ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శంచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మోహన్ బాబు (Mohan Babu), విష్ణు (Vishnu)తో పాటు సినిమా టీమ్ కలిసి తాజాగా కేదార్‌నాథ్ (Kedarnath) క్షేత్రాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో (video)ను షేర్ చేస్తూ.. ‘12 జ్యోతిర్లింగాల ప్రయాణాన్ని స్టార్ట్ (start) చేశాము. పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్‌ను సందర్శించాం. కన్నప్ప సినిమా కోసం ప్రార్థించాం’ అంటూ మంచు విష్ణు ట్విట్టర్ ‘X’ వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా.. ప్రజెంట్ సినిమా షూటింగ్ (shooting) శరవేగంగా జరుగుతుందని తెలుస్తుండగా.. డిసెంబర్ (December)లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

Advertisement

Next Story