- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘పుష్ప-2’ వల్ల కన్నప్ప విడుదల వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’(Kannappa). దీనికీ ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తుండగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్,శరత్ కుమార్, అవ్రామ్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో ‘కన్నప్ప’ మూవీ పుష్ప-2(Pushpa 2: The Rule) కారణంగా డిసెంబర్‌లో కాకుండా ఏప్రిల్‌లో విడుదలవుతుందనే ప్రచారం మొదలైంది. అందుకే వెనక్కి తగ్గినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, మంచు విష్ణు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలతో మాట్లాడుకుని విరామం ఉండేలా చూసి విడుదల చేస్తాము. ‘కన్నప్ప’ ఆగస్టు(August)లో రిలీజ్ చేద్దామనుకుంటే కుదరలేదు. అయితే డిసెంబర్‌లో అయినా తీసుకురావాలని భావించాం.
కానీ వీఎఫ్‌ఎక్స్ ఎక్కువ. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవడం లేదు. ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నాం. అందుకే ఏప్రిల్‌లో అన్ని పనులు పూర్తి అయ్యాక విడుదల చేస్తున్నాము. అంతేకానీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) వస్తుందని కాదు. అయినా రెండు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్లు(Distributors) ఒక్కరే. అయితే ప్రజెంట్ పారిస్‌లో సీక్వెన్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ చివరి వరకు ఫుటేజ్ వస్తుంది. అన్ని పరమేశ్వరుడు చూసుకుంటాడు’’ అని చెప్పుకొచ్చారు.
Read More...
Allu Arjun: బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా.. రెండు తెలుగు స్టేట్స్‌లో Pushpa-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..!!