Telangana News: టీఆర్ఎస్ పార్టీలో చేరికలు

by Mahesh |   ( Updated:2022-04-09 05:24:27.0  )
Telangana News: టీఆర్ఎస్ పార్టీలో చేరికలు
X

దిశ, కొత్తపల్లి: మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో బాగంగా మద్దూరు మండలంలోనీ పెద్దాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పలు వీధుల గుండా తిరుగుతూ..ప్రజల బాగోగులు తెలుసుకుంటూ పంచాయతీ దగ్గర గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ గోవర్దన్ రెడ్డి‌తో పాటు మరో 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాబోయే రోజుల్లో బారి సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీ వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ‌లు బాల్ సింగ్, సలీం, వీరారెడ్డి, విరేశ్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story