- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్
దిశ, ఏపీ బ్యూరో: 'అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో పాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా. ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, 25వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులు పెట్టి మరీ చెప్పారు. మెగా డీఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు. పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్ చేశారు. అవి కూడా ఇప్పటికీ భర్తీ కాలేదు' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.
జాబ్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల నిరాశ నిస్పృహలతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారు. మాకు ఉద్యోగాలు ఏవి అని కలెక్టరేట్ల దగ్గరకు వెళ్ళి యువత అడిగితే లారీ ఛార్జీలు చేయించి అరెస్టులు చేస్తున్నారు . రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన యాక్షన్ అనేది ఈ ప్రభుత్వం దగ్గర ఉందా ? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
'నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారో చెప్పాలి. ఆ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ? అవి ఎంత వరకూ అమలులోకి వచ్చాయో యువతకు వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి' అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ప్రకటన ఎప్పుడు ఇస్తారు. 6 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుంది? అని ప్రభుత్వాన్ని జనసేనాని ప్రశ్నించారు.
'బీఈడీ చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వాళ్ళు, పలు ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయోపరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారు. యువత ఆందోళన అనేది ఈ ప్రభుత్వానికి అర్ధమవుతోందా ? అర్థమైనా అర్థం కానట్లు ఉందా అనే సందేహం కలుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదు అని పాలకులు గుర్తించాలి' అని పవన్ కళ్యాణ్ సూచించారు.