Surya: రూ. 600 కోట్లతో సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్.. హైప్ పెంచేస్తున్న పోస్టర్

by sudharani |
Surya: రూ. 600 కోట్లతో సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్.. హైప్ పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతూ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya).. రీసెంట్‌గా వచ్చిన ‘కంగువ’ (Kanguva)తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక దక్షిణాదిలో కూడా విశేష ఆదరణను సొంతం చేసుకున్న ఈయన.. త్వరలో బాలీవుడ్‌ (Bollywood) లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మేరకు సీనియార్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా (Rakesh Omprakash Mehra) డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు ‘కర్ణ’ (Karna) అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య కర్ణుడిగా కనిపించనున్నారని తెలుస్తుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాలమిస్ట్, రాజకీయ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ (Manobala Vijayabalan) సూర్య తన X వేదికగా.. ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇందులో.. ‘కర్ణ’ చిత్రం ఏకంగా రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది అనే విషయాన్ని తెలియజేస్తూ.. కర్ణుడిగా కనిపిస్తున్న సూర్య లుక్‌లో నెట్టింట షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. ఇందులో సూర్య లుక్ మాత్రం వేరే లెవల్ అంటూ కామంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed