- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఫకీర్ బాబా..
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : తాయత్తు కడతానని ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఫకీర్ బాబా మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన ఓ మహిళ ఇంట్లోకి ఫకీర్ ప్రవేశించి మంచినీళ్లు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత నీకు మంత్రాలు చేశారని తన దగ్గర ఉన్న తాయత్తు కడితే బాగవుతుందని నమ్మబలికి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ కు గురైన మహిళ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు గమనించి ఫకీర్ బాబాను పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు ఫకీర్ బాబాకు సంబంధించిన బ్యాగ్ లో కొన్ని తాయత్తులతో పాటు గుర్తు తెలియని పౌడర్ ప్యాకెట్లు లభించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బాధిత మహిళ గతంలో వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్న సమయంలో ఇదే ఫకీర్ బాబా ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించడంతో కేకలు వేయగా పారిపోయినట్లు బాధిత మహిళ తెలిపింది.