AP Deputy CM: ‘ఆ విషయంలో ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-12-21 11:24:13.0  )
AP Deputy CM: ‘ఆ విషయంలో ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అల్లూరి జిల్లాలో రెండో రోజు పర్యటించారు. స్థానిక సమస్యల పై ప్రజలు, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను కేవలం ఒక రోడ్డు వేయించి వెళ్లిపోనని, 5 ఏళ్లు పని చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి బల్లగరువులో పర్యటించిన ఆయన 100 కి.మీ మేర 120 రోడ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇంతకు ముందు 250 మంది ఉంటే కానీ రోడ్లు పడేవి కాదని, కానీ 100 మంది ఉన్నా రోడ్డు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను అంటే ఇక్కడున్న మీరంతా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలు అక్కర్లేదు. ఇదే 100 కోట్లు ముఖ్యమంత్రి(CM Chandrababu) తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు, నేను కాకినాడలోనో ఇంకో ప్రాంతంలోనో పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు వచ్చాం అంటే మీ కష్టాల్లో మేము అండగా ఉన్నాం అని చెప్పడానికి అని పేర్కొన్నారు. పంచాయితీ సర్పంచ్ లకు విలువ లేని పరిస్థితుల్లో ఈ రోజు తల ఎత్తుకుని మేము సర్పంచులం అని చెప్పుకునే స్థాయిలో మేము పెట్టాం అని ఆయన తెలిపారు.

Advertisement

Next Story