- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అనుభవం ఉన్న వారిని రాత పరీక్ష రాయమనడం సిగ్గుచేటు’
దిశ, కామారెడ్డి టౌన్ : 23 సంవత్సరాల అనుభవమున్న కాంటాక్ట్ ఏఎన్ఎంలను ప్రస్తుతం పరీక్ష రాసిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని చెప్పడం సిగ్గుచేటని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని కాంటాక్ట్ ఏఎన్ఎంలు మున్సిపల్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము ఈ ఉద్యోగంలో చేరే సమయంలోనే పరీక్షలు రాసే ఉద్యోగంలో చేరడం జరిగిందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ఎన్నోసార్లు తమను రెగ్యులర్ చేయాలని కోరిన ఆ ప్రభుత్వం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము రెగ్యులర్ అవుతామని ఎన్నో కలలు కన్నామని ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ మాదిరిగానే వ్యవహరిస్తోందన్నారు.
ఏ పనిలోనైనా అనుభవం ముఖ్యమని, తమకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని దాని ఆధారంగా తమను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఏదో కారణం చెప్పి తమను ఈ ప్రభుత్వం తొలగించాలని చూస్తుందని, తమను రెగ్యులరైజ్ చేసే వరకు తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, నాయకులు కొత్త నరసింహులు, ఆశా వర్కర్లు దీవెన, కవిత, అర్నియా, సంధ్యారాణి, స్వరూప, రేణుక, జోష్ణ దేవి, మౌనిక, విజయ, గంగమని, ఫ్లారెన్స్, బాలబాయి, శైలజ తదితరులు పాల్గొన్నారు.