ఆ సినిమా చూస్తూ పాకిస్థాన్‌కు జై కొట్టిన యువకులు.. వీడియో వైరల్

by Satheesh |
ఆ సినిమా చూస్తూ పాకిస్థాన్‌కు జై కొట్టిన యువకులు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో కొంతమంది యువకులు పాకిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని నటరాజ్‌ థియేటర్‌లో మూవీ చూసిన ఇద్దరు వ్యక్తులు 'పాకిస్థాన్‌ జై' అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది యువకులు ఆవేశంతో ఊగిపోతూ వాళ్లపై దాడి చేయడానికి ప్రయత్నించగా వారిద్దరూ తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా.. చిన్న చిత్రంగా 600 థియేటర్లలో విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' ప్రస్తుతం 2 వేల థియేటర్లలో ప్రదర్శించబడుతుండటం విశేషం.

Advertisement

Next Story