భారీ ఆయిల్ కొన్న భారత్.. రేట్ ఎంతో తెలుసా..?

by Javid Pasha |
భారీ ఆయిల్ కొన్న భారత్.. రేట్ ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో పెట్రోల్‌తో పాటు వంట నూనె పోటీ పడుతోంది. ఎప్పుడు ఎంత రేట్ పెరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే తాజాగా రష్యా నుంచి భారత్ భారీ మొత్తం సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసిందట. అంతేకాకుండా ఈ నూనెను రికార్డు స్థాయికి ధరకు కొన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా పత్రిక కథనం ప్రకారం.. ఉక్రెయిన్ నుంచి రావాల్సిన నూనె ఆగిపోవడంతో మార్కెట్‌లో నూనె రేట్లు ఆకాశాన్నింటే మారాయి. దానికి చెక్ చెప్పేందుకు భారత్ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా రష్యా నుంచి 45 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోనుంది. ఈ నూనె ఏప్రిల్ నెలలో భారత్‌కు చేరనుంది. టన్ను క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్‌ను భారత రిఫైనర్లు దాదాపు 2,150 డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. మరి ఇకనైనా దేశంలో వంట నూనె ధరలు అందుబాటులోకి వస్తాయా లేదా అన్నది చూడాలి.

Advertisement

Next Story