రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం.. ఓటింగ్ దూరంగా భారత్, చైనా

by Vinod kumar |
రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం.. ఓటింగ్ దూరంగా భారత్, చైనా
X

న్యూయార్క్: ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభానికి రష్యాను నిందిస్తూ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఆమోదించింది. వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని రష్యాకు గురువారం పిలుపునిచ్చింది. లక్షల సంఖ్య పౌరులకు, నివాసాలు, పాఠశాల, ఆసుపత్రులకు రక్షణ ఇవ్వాలని కోరింది. కాగా తాజా సమావేశానికి భారత్ మరోసారి ఓటింగ్‌కు దూరంగా ఉంది. ముసాయిదా తీర్మానం ఈ సవాళ్లపై మేము ఆశించిన దృష్టిని పూర్తిగా ప్రతిబింబించలేదని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు.


మొత్తం 140 దేశాలు ఉక్రెయిన్‌కు మద్ధతు ప్రకటించగా.. బెలారస్, సిరియా, ఉత్తర కొరియా, ఎరిట్రియా దేశాలు రష్యాకు మద్దతు ప్రకటించారు. మరో వైపు 38 దేశాలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. వాటిలో భారత్, చైనా వంటి దేశాలు ఉన్నాయి. తమపై వ్యతిరేకత ప్రకటించిన దేశాలను రష్యా ఖండించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అంతా ఆందోళనకరంగా ఏమి లేవని పేర్కొంది. ఉద్దేశ్యపూర్వకంగానే రాజకీయం చేస్తున్నాయని ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed