శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం..

by Vinod kumar |
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం..
X

దిశ, భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురారోపణం జరిగింది. ఉదయం ఉత్సవ మూర్తులకు విశేష స్నపనం గావించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి హారతులు ఇచ్చారు. సాయంత్రం అంకురారోపణం వేడుక నిర్వహించారు. పట్టణంలోని తాత గుడి సెంటర్ వద్ద పుట్టమన్ను సేకరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయానికి తీసుకువచ్చి అంకురారోపణం చేశారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజపటం, భద్ర మండల లేఖనం, సాయంత్రం గరుడాదివాసం నిర్వహించనున్నారు. ప్రధాన వేడుకలు అయిన శ్రీ సీతా రాముల వారి కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం తుది ఏర్పాట్లపై నిమగ్నమైంది.



Advertisement

Next Story