- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IFTU తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
దిశ, వెబ్‌డెస్క్ : భారత కార్మిక సంఘాల సమాఖ్య ( IFTU) రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్‌లో IFTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.శ్రీనివాస్, కార్యదర్శి జనార్ధన్, అరుణక్క అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కమిటీ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ సహాయ కార్యదర్శి పి.ప్రసాద్ సమక్షంలో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇఫ్టు నుండి కొంతమంది వెళ్లి పోవడంతో అనివార్యంగా రాష్ట్రస్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు.
ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షుడిగా టి.శ్రీనివాస్ (మంచిర్యాల), ఉపాధ్యక్షులుగా అరుణ (హైదరాబాద్), బి.భూమన్న (నిజామాబాద్) , చాంద్ పాషా (మంచిర్యాల), ప్రధాన కార్యదర్శిగా ఆర్. జనార్దన్ (యాదాద్రి భువనగిరి), కార్యదర్శులుగా ఐ.కృష్ణ (గోదావరి ఖని), సీహెచ్.భూమేశ్వర్ (జగిత్యాల), ఎన్.దాసు (నిజామాబాద్) కోశాధికారిగా గంట నాగయ్య (సూర్యాపేట)తోపాటు మరో 13 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం 200 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కార్మిక వర్గ స్థితి గతులపై విస్తృతంగా చర్చించారు. నరేంద్ర మోడీ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 28, 29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాడానికి ఆయా జిల్లా సదస్సులపై చర్చించి పలు నిర్ణయాలు చేశారు.