Ardha Shalabhasana Yoga: అర్ధ శలభాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

by Manoj |   ( Updated:2023-10-10 15:21:46.0  )
Ardha Shalabhasana Yoga Benefits and Steps
X

దిశ, ఫీచర్స్: Ardha Shalabhasana Yoga Benefits and Steps| మొదటగా బల్ల పరుపు నేలపై బోర్లా పడుకోవాలి. తర్వాత బాడీని రిలాక్స్ చేసి రెండు చేతులను వెల్లకిలా పెట్టి అరచేతులను తొడల కింద ఉంచాలి. ఇప్పుడు తలను నిటారుగా చేసి గదవను మాత్రమే నేలపై ఆన్చాలి. తర్వాత పొట్టనిండా గాలి పీల్చి నెమ్మదిగా ఎడమ కాలును వీలైనంత పైకి లేపాలి. అలా కాసేపు ఆపిన తర్వాత శ్వాస వదలాలి. ఇలా రెండు కాళ్లతో పదిసార్లు చేయాలి.

ప్రయోజనాలు:

* వెన్నెముకను బలోపేతం చేస్తుంది.

* భుజాలను సాగదీస్తుంది.

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.

* శరీరంలో అధిక కొవ్వును కరిగిస్తుంది.

ఇది కూడా చదవండి: మండూకాసనం.. దీని వల్ల ఉపయోగమేంటో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed