‘డ్రింకర్ సాయి’ మూవీ టీమ్ బంపర్ ఆఫర్.. వారికి ఫ్రీ మూవీ టికెట్లతో పాటు న్యూ ఇయర్ పార్టీ(పోస్ట్)

by Kavitha |   ( Updated:2024-12-29 11:22:18.0  )
‘డ్రింకర్ సాయి’ మూవీ టీమ్ బంపర్ ఆఫర్.. వారికి ఫ్రీ మూవీ టికెట్లతో పాటు న్యూ ఇయర్ పార్టీ(పోస్ట్)
X

దిశ, సినిమా: యంగ్ హీరో ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘డ్రింకర్ సాయి’. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించాడు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘డ్రింకర్ సాయి’ డిసెంబర్ 27న విడుదల అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో ధర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మా సినిమా గురించి ట్వీట్ చేసి ప్రోత్సహించిన సాయి దుర్గ తేజ్ అన్నకు థ్యాంక్స్. అలాగే నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా ముగ్గురు నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. వాళ్లను లైఫ్‌‌లో మర్చిపోను. ఈ సినిమాతో నేను యూత్‌‌ను చెడగొట్టలేదు అనే పేరొచ్చింది చాలు. మంచి సామాజిక సందేశంతో ఈ సినిమా చేశాం. ముఖ్యంగా మహిళలకు ఈ సినిమా బాగా నచ్చుతోంది. అందుకే మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్స్‌‌ను ఉచితంగా ఇవ్వబోతున్నా’ అని ప్రకటించారు.

అదే విధంగా డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి మాట్లాడుతూ.. ‘ మా సినిమాని విజయవంతం చేసిన ఆడియన్స్‌కు థ్యాంక్స్. ప్రేక్షకుల నుంచే రివ్యూస్ తీసుకోబోతున్నాం. అందుకే ఒక కాంటెస్ట్ నిర్వహించాం. ఈ కాంటెస్ట్‌లో ఎంపికైన వారికి డ్రింకర్ సాయి ఈ నెల 31న మంచి పార్టీ ఇస్తాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story