2025 @ అభివృద్ధి ఆశ‌లు..

by Sumithra |
2025 @ అభివృద్ధి ఆశ‌లు..
X

న‌గ‌రాభివృద్ధికి బ‌ల‌మైన‌ పునాదులు ప‌డిన 2024 సంవ‌త్స‌రానికి వీడ్కోలు ప‌లికిన జిల్లావాసులు అనేక ఆకాంక్ష‌ల‌తో కొత్త సంవ‌త్స‌రం 2025కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాకా వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాకు అభివృద్ధి విష‌యంలో ప్రాధాన్యం క‌ల్పిస్తూ వ‌స్తోంది. వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని రాష్ట్ర రెండో రాజ‌ధాని స్థాయిలో అభివృద్ధి చేస్తామ‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. త‌ద‌నుగుణంగానే ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల్లో భాగంగా వ‌రంగ‌ల్‌లో స‌భ నిర్వ‌హ‌ణ‌కు రెండు రోజుల ముందే న‌గ‌రాభివృద్ధికి నిధుల వ‌ర‌ద పారించారు. న‌గ‌రాభివృద్ధికి కీల‌క‌మైన మాస్ట‌ర్ ప్లాన్‌కు ఆమోదం తెలుప‌డం, ఎయిర్ పోర్టు భూ సేక‌ర‌ణ‌కు రూ.205కోట్లు మంజూరు చేశారు. మున్సిపల్ పరిపాలన భవనం, అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి, పాలిటెక్నిక్ కళాశాలకు, ఇలా అనేక పనులకు కలిపి మొత్తంగా ఓరుగ‌ల్లులో అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.5 వేల‌ కోట్ల నిధుల‌ను మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని రెండో రాజ‌ధానిగా డెవ‌ల‌ప్ చేస్తామ‌న్న ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో ఓరుగ‌ల్లువాసుల్లో అభివృద్ధి పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్య‌వ‌సాయ ఆధారితంగాను, వ‌స్తుసేవ‌ల వినియోగం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంగా ఉన్న ఓరుగ‌ల్లులో పారిశ్రామిక అభివృద్ధికి ప్ర‌భుత్వం చొర‌వ చూపాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : న‌గ‌రాభివృద్ధికి బ‌ల‌మైన‌ పునాదులు ప‌డిన 2024 సంవ‌త్స‌రానికి వీడ్కోలు ప‌లికిన జిల్లావాసులు అనేక ఆకాంక్ష‌ల‌తో కొత్త సంవ‌త్స‌రం 2025కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాకా వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాకు అభివృద్ధి విష‌యంలో ప్రాధాన్యం క‌ల్పిస్తూ వ‌స్తోంది. వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని రాష్ట్ర రెండో రాజ‌ధాని స్థాయిలో అభివృద్ధి చేస్తామ‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. త‌ద‌నుగుణంగానే ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల్లో భాగంగా వ‌రంగ‌ల్‌లో స‌భ నిర్వ‌హ‌ణ‌కు రెండు రోజుల ముందే న‌గ‌రాభివృద్ధికి నిధుల వ‌ర‌ద పారించారు. న‌గ‌రాభివృద్ధికి కీల‌క‌మైన మాస్ట‌ర్ ప్లాన్‌కు ఆమోదం తెలుప‌డం, ఏయిర్ పోర్టు భూ సేక‌ర‌ణ‌కు రూ.205 కోట్లు మంజూరు చేయ‌డం, మున్సిపల్ పరిపాలన భవనం శంకుస్థాపన‌కు రూ.32.50కోట్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి శంకుస్థాపన - రూ.4170కోట్లు, పాలిటెక్నిక్ కళాశాల శంకుస్థాపన రూ.28 కోట్లు, ఇంటర్నల్ రింగ్ రోడ్డు శంకుస్థాపన రూ.80 కోట్లు, వరంగల్ తూర్పు అభివృద్ధి పనుల శంకుస్థాపన రూ.3 కోట్లు, ఫ్లడ్ డ్రైనేజీ సిస్టం శంకుస్థాపన రూ.160.3కోట్లు, రహదారుల అభివృద్ధి రూ.49.50కోట్లు, పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట రోడ్డు 4 లైన్ల విస్తరణకు రూ.6.50 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఓరుగ‌ల్లులో అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.5 వేల‌ కోట్ల నిధుల‌ను మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. అలాగే భ‌ద్ర‌కాళి ఆల‌య అభివృద్ధి ప‌నులకు రూ.30 కోట్లు కేటాయించింది.

అభివృద్ధి.. ఆకాంక్ష‌..

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలోని ప‌లు పెండింగ్ ప్రాజెక్టుల‌కు పెద్దమొత్తంలో నిధులను మంజూరు చేయ‌డంతో ప‌నుల్లో వేగం పెరిగింది. వ‌రంగ‌ల్ వాసులు సుదీర్ఘ‌కాలంగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి సానుకూలత‌లు పెరగ‌డంతో భూ సేక‌ర‌ణ అంశాన్ని వేగిరం చేస్తోంది. ఇప్ప‌టికే భూ సేక‌ర‌ణ‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింది. భూ సేక‌ర‌ణ ప‌నుల‌ను రెవెన్యూ శాఖ ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఎయిర్ పోర్టు ప‌నుల‌ను ప్రారంభించేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సన్న‌ద్ధంగా ఉన్న‌ట్లు స్వ‌యంగా కేంద్ర విమానయానశాఖ మంత్రి ఎర్రం రాంమోహ‌న్‌నాయుడు తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే. ఎయిర్ పోర్టు అందుబాటులోకి వ‌స్తే న‌గ‌రాభివృద్ధిలో నూత‌న శ‌కం ప్రారంభ‌మ‌వుతుంద‌ని న‌గ‌రావాసులు భావిస్తున్నారు. ఇంత‌టి కీల‌కమైన డెవ‌ల‌ప్‌మెంట్‌కు 2025లో కీల‌క ముందడుగు ప‌డుతుంద‌ని జ‌నాలు ఆశిస్తున్నారు. ఇంకో ప్ర‌ధాన‌మైన వ్యాగ‌న్ ప‌రిశ్ర‌మ 2025లో పూర్తి కానుంది. ఇది పూర్త‌యితే కొత్త‌గా వేలాది మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు మెరుగు ప‌డ‌నున్నాయి. రైల్వే కూడ‌లి కాజీపేట జంక్ష‌న్ బ‌లోపేతానికి, కాజీపేట ప‌ట్ట‌ణ ప‌రిస‌ర ప్రాంతాల అభివృద్ధికి ప‌రోక్షంగా దోహ‌దం చేయ‌నుంది. అండ‌ర్ డ్రైనేజీ, ర‌హ‌దారుల నిర్మాణం, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అవుట‌ర్ రింగ్ రోడ్డు ప‌నులు ముందుకు సాగ‌నున్నాయి.

ఐటీ, పారిశ్రామికం పై ఆశ‌లు..!

వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని రెండో రాజ‌ధానిగా డెవ‌ల‌ప్ చేస్తామ‌న్న ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో ఓరుగ‌ల్లువాసుల్లో అభివృద్ధి పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. స‌మీప భ‌విష్య‌త్‌లో ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చే అవ‌కాశం క‌నిపిస్తుండ‌డంతో ఐటీ, పారిశ్రామిక రంగాన్ని డెవ‌ల‌ప్ చేస్తేనే న‌గ‌రంలో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డి ఆర్థికాభివృద్ధికి బాట‌లు వేసిన‌ట్ల‌వుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌రంగ‌ల్‌లో ఇప్ప‌టికే దాదాపు 10 వ‌ర‌కు ఐటీ కంపెనీలు న‌డుస్తున్నాయి. ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు గుండెకాయ‌గా, ప‌దుల సంఖ్య‌లో పేరెన్నిక‌గ‌న్న విద్యాసంస్థ‌ల‌కు నెలవుగా ఉన్న వ‌రంగ‌ల్‌ను ఐటీ హ‌బ్‌గా మార్చేందుకు ఎన్నో అనుకూల‌త‌లున్నాయ‌ని, దీని పై దృష్టి పెట్టాల‌ని వ‌రంగ‌ల్‌ వాసులు కోరుతున్నారు. వ్య‌వ‌సాయ ఆధారితం గాను, వ‌స్తుసేవ‌ల వినియోగం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంగా ఉన్న ఓరుగ‌ల్లులో పారిశ్రామిక అభివృద్ధికి ప్ర‌భుత్వం చొర‌వ చూపాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed