Kriti Shetty: అందరికీ కృతజ్ఞతలు చెబుతూ కుర్ర హీరోయిన్ ఆసక్తికర పోస్ట్

by Anjali |
Kriti Shetty:  అందరికీ కృతజ్ఞతలు చెబుతూ కుర్ర హీరోయిన్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి(Tollywood heroine Kriti Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఉప్పెన(Uppena) సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఓవర్ నైట్ యువతలో మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే నేడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతోన్న వేళ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

‘‘2024 లో నేను చాలా నేర్చుకున్నాను. అనుభవాలు, ఎదుగుదల, జ్జాపకాలు ఎన్నో ఉన్నాయి. నా సినిమాలు ప్రేక్షకుల నుంచి నాకు చాలా ప్రేమను తెచ్చిపెట్టాయి. సినిమాల్లో నటీనటులతో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అద్భుతమైన వ్యక్తులందరితో కలిసి పని చేయడానికి.. నేర్చుకునే అవకాశం నాకు లభించింది. ఏడాది పొడవునా నాతో కలిసి పనిచేసిన నా బృందానికి నేను ఎనలేని కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మే 2025 శాంతి ఆనందాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం నేను పనిచేసినవన్నీ పంచుకోవడానికి వేచి ఉండలేను, అది త్వరలో విడుదల కానుంది’’.

Advertisement

Next Story

Most Viewed