- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశాఖ సెంట్రల్ జైలులో వివాదం.. ఉన్నతాధికారుల సీరియస్
దిశ, వెబ్ డెస్క్: విశాఖ సెంట్రల్ జైలు(Visakha Central Jail)లో తలెత్తిన వివాదం రచ్చకు దారి తీసింది. విధులకు హాజరవుతున్న వార్డర్లను, కానిస్టేబుళ్లను సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నారు. దీంతో వార్డర్లు, కానిస్టేబుళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణ పేరుతో తమను సూపరింటెండెంట్ మహేశ్‌బాబు(Superintendent Mahesh Babu) వేధిస్తున్నారని మండిపడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జైలు ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే సూపరింటెండెంట్ మహేశ్ బాబు మాత్రం తమ తప్పేమి లేదని చెబుతన్నారు. జైలు వార్డర్లు జయకృష్ణ, శంభు(Jail Warders Jayakrishna, Sambhu) విధుల్లోకి వచ్చేటప్పుడు గంజాయి తీసుకొస్తున్నారని, అందువల్లనే వాళ్లను తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నారు. జైలు నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని అంటున్నారు.
అయితే ఈ వివాదంపై ఉన్నతాధికారుల సీరియస్ అయ్యారు. జైలులో డీఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. సిబ్బంది ఆందోళనకు దారి తీసిన పరిణామాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరోసారి కూడా సిబ్బంది కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. డీఐజీ రవికిరణ్(DIG Ravi Kiran) సూపరింటెండెంట్ వివరణ మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anita)ని కలుస్తామన్నని సిబ్బంది కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.