Karavali: ‘కరావళి’ టీజర్ రిలీజ్.. పిశాచులకు, మనుషులకు మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ

by Prasanna |
Karavali: ‘కరావళి’ టీజర్ రిలీజ్.. పిశాచులకు, మనుషులకు మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. కథ బాగుంటే చాలు రెండు, మూడు సార్లు అయినా థియేటర్ కి వెళ్లి చూస్తున్నారు. అయితే, త్వరలో కన్నడ నుంచి కరావళి అనే కొత్త మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో గురుదత్త గనిగ ఫిల్మ్స్‌ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే కరావళి ( karavali) మూవీ నుంచి ఫస్ట్ లుక్, ప్రోమోలు విడుదల చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఓ కుర్చీ, గేదెల చుట్టూ కథ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. పిశాచులకు, మనుషులకు మధ్య జరిగే కాన్సెప్ట్‌ ను బాగా చూపించారు. ఇలాంటి కథతో ఇంత వరకు సినిమా రాలేదు. హారర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

కన్నడ హీరో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ కి ఇది 40వ సినిమా. ప్రస్తుతం, టీజర్‌ నెట్టింట వైరల్ గా అవుతుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. ఈ మూవీకి సచిన్ బస్రూర్ సంగీతాన్ని అందించారు. కరావళి మూవీ 2025 లో విడుదల కానుంది.

Advertisement

Next Story

Most Viewed