- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా : అడ్లూరి లక్ష్మణ్ కుమార్
దిశ,వెల్గటూర్ : వెల్గటూర్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం పూర్తి అయ్యేంతవరకు సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉంటాయని అయ్యప్ప స్వాములకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.వెల్గటూర్ మండల కేంద్రంలో నూతనంగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలని వెల్గటూర్ మండల అయ్యప్పలు ఆదివారం ధర్మపురి క్యాంపు కార్యాలయానికి తరలి విప్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప స్వాముల విజ్ఞప్తికి విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఆలయానికి అవసరమైన స్థలమును మండల కేంద్రం లోని పెద్దవాగు తీరంలో ఇప్పటికే గుర్తించామన్నారు.అదే స్థలంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి భూమి పూజ చేస్తామని హామీ ఇచ్చారు.
ఆలయ నిర్మాణం మొద లుకొని పూర్తి అయ్యేంత వరకు అన్ని విధాలా తన సహకారం ఉంటుందని విప్పు హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయ్యప్ప గుడి కల త్వరలో నెరవేర బోతుందని అయ్యప్పలు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా శబరి యాత్రకు ఆర్టీసీ ద్వారా వెళ్లే స్వాములకు తమిళనాడు బోర్డర్ టాక్స్ మాఫీ కోసం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో విప్ మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా స్వాములు ప్రభుత్వ విప్ ను శాలువాతో సత్కరించి, అయ్యప్ప స్వామి వారి ఫోటో అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండ్ర శ్రీకాంత్ రావు, గుండాటి సందీప్ రెడ్డి,కొత్త తిరుమల్, గురు స్వాములు చంద్రమౌళి, పెద్ది శ్రీనివాస్ నరేష్ స్వామి, రామస్వామి తదితరులు ఉన్నారు.