తక్షణమే సమాచారం అందించడంలో దిశ ముందడుగు..

by Sumithra |   ( Updated:2024-12-29 09:26:05.0  )
తక్షణమే సమాచారం అందించడంలో దిశ ముందడుగు..
X

దిశ, కోరుట్ల : డిజిటల్ ప్రింటింగ్ రూపంలో ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందు నిలుస్తుందని మెట్ పల్లి డీఎస్పీ ఏ.రాములు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఆదివారం దిశ పత్రిక 2025 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వార్తలను వేగంగా ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో దిశ పత్రిక ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్, రిపోర్టర్లు ముక్కెర చంద్రశేఖర్, గజం శంకర్, వంగ ప్రభాకర్, బుద్ధురి సతీష్, భోగ నవీన్, దిశ రిపోర్టర్లు కేఎల్ రెడ్డి, హైమత్, అల్లే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story